సినిమాహాళ్లు దేశభక్తి వేదికలా?

0
30

రాజకీయ పార్టీల విధానాల ప్రకారం దేశభక్తిని అంచనా వేయడం సరికాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రెండు రోజులుగా ట్విట్టర్‌ వేదికగా వివిధ అంశాలపై స్పందిస్తున్న పవన్‌ మూడో రోజు దేశభక్తిపై ట్వీట్లు చేశారు. జాతి, కుల, మత, వర్గ, ప్రాంత, భాషా బేధాలకు అతీతంగా వ్యవహరించడమే నిజమైన దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయపార్టీ విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయరాదని పవన్‌ తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ ఆలోచనలకు భిన్నంగా స్పందించే వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదని స్పష్టం చేశారు. అలా వేస్తే ఢిల్లీ జేఎన్‌యూలో ఏం జరిగిందో అలాగే తిరుగుబాట్లు తప్పవని హెచ్చరించారు. దేశద్రోహి అంటూ అక్కడి విద్యార్థులపై కేసులు పెడితే ఏం జరిగిందో తెలిసిందేనన్నారు. కుటుంబంతో కలిసి సాయంత్రం సరదాగా సినిమాకు వెళ్తే  అక్కడ కూడా దేశభక్తి నిరూపించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY