సిటీ కోర్టు, ఐటీ టవర్‌ డిజైన్లు రెడీ

0
6

రాజధానిలో సిటీ కోర్టు, ఐటీ టవర్‌ భవనాల డిజైన్లు రెడీ అయ్యాయని, ఆన్‌లైన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు ఎంపిక చేసిన వాటినే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.

తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో వెయ్యి అపార్టుమెంట్లను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, ప్రజలకు విక్రయించనుందని నారాయణ తెలిపారు. 2, 3 బెడ్‌రూమ్‌లుగా నిర్మించే అపార్టుమెంట్లను ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామని చెప్పారు.

LEAVE A REPLY