సిక్స్‌లు బాదుతూనే ఉంటా

0
25

కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా వైదొలిగి అభిమానులను ఒకింత నిరాశపరిచిన ధోనీ..కిక్కించే మాటలతో ఊరట కల్పించాడు. కెరీర్ ఆరంభంలో ఎలాగైతే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్లు కొట్టానో..భవిష్యత్తులో కూడా అదే తరహాలో బ్యాటు ఝులిపిస్తానని అన్నాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో వామప్ మ్యాచ్ ముగిశాక ధోనీతో కలిసి యువరాజ్ డ్రెస్సింగ్ రూమ్‌లో హల్‌చల్ చేశాడు. ధోనీని సరదాగా ఇంటర్వ్యూ చేసిన యువరాజ్ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో కెప్టెన్సీ నుంచి వైదొలిగావు కదా.. మళ్లీ సిక్స్‌లు కొడుతావా అని యువీ ప్రశ్నించగా.. పరిస్థితులు అనుకూలిస్తే సిక్స్‌లు కొట్టేందుకు ఏమాత్రం వెనుకాడను అని మహీ సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అత్యుత్త మ కెప్టెన్లలో ధోనీ ఒకడంటూ యువీ కితాబిచ్చాడు.

LEAVE A REPLY