సింగం 3 ఈ డేట్ కే రిలీజ్ కానుందా?

0
20

తమిళ స్టార్ హీరో సూర్య అందాల భామలు అనుష్క, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం సింగం3. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సింగం సిరీస్ లో మూడో పార్ట్ గా రూపొందింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్దమైన సినిమా పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ లో ధృవ మూవీ వలన తన చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్న సూర్య, జనవరిలో జల్లి కట్టు నిరసనల వలన కాస్త వెనక్కు తగ్గాడు. జనవరి 26న విడుదల చేస్తున్నామని భారీ ప్రమోషన్స్ చేసుకున్నా చివరి నిమిషంలో రిలీజ్ డేట్ మార్చారు. ఇటు తెలుగు, తమిళ రాష్ట్రాలలో పరిస్థితులు అనుకూలంగా ఉన్న టైంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ చిత్రాన్ని ఫిబ్రవరి 3 న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. మరి ఫిబ్రవరి 3న నాని చిత్రం నేను లోకల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తోండగా ఇటు సింగం 3 అటు నేను లోకల్ మధ్య ఏ రేంజ్ ఫైటింగ్ జరగనుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here