సాహా అజేయ డబుల్ రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్

0
15

ఇరానీ కప్‌ను డిఫెండింగ్ చాంపియన్ రెస్టాఫ్ ఇండియా కైవసం చేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ లో చతేశ్వర్ పుజార నాయకత్వంలోని రెస్టాఫ్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 379 పరుగుల లక్ష్యం కోసం ఆఖరి రోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన రెస్టాఫ్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా (272 బంతుల్లో 203 నాటౌట్; 26 ఫోర్లు, 6సిక్స్‌లు), పుజార (238 బంతుల్లో 116 నాటౌట్; 16 ఫోర్లు) సూపర్ సెంచరీలతో విజృంభించారు. రంజీ చాంపియన్ గుజరాత్ పసలేని బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొం టూ ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here