సావిత్రిలా మారిపోయిన కీర్తి సురేష్‌!

0
30

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్‌ ప్రధాన ప్రాతలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పేరు ‘మహానటి’. అశ్వనీదత్‌ నిర్మాణంలో నాగ్‌అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ మహానటి పాత్రలో కనిపిస్తున్నారు కీర్తి సురేష్‌. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌ లొకేషన్‌కు అచ్చం సావిత్రిలాగానే తయారై వచ్చారు కీర్తి సురేష్‌. రెండు జడలతో ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రిలా కనిపిస్తున్నారు కీర్తి సురేష్‌. కీర్తి కంటే ముందు సావిత్రి పాత్ర కోసం నిత్యామీనన్‌, విద్యా బాలన్‌ను అనుకున్నారు. చివరకు కీర్తి సురేష్‌ను ఎంచుకున్నారు డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌. ఆయన నిర్ణయం ఎంత కరెక్టో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది కదూ!

LEAVE A REPLY