సావిత్రిగా శైలజానే ఫైనలా

0
23
ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి క్లాస్‌ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. బడా నిర్మాత అశ్వనీదత్‌కు అల్లుడైన అశ్విన్‌ చాలారోజుల క్రితమే ఓ ఆసక్తికర సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అదే మహానటి సావిత్రి బయోపిక్‌ ‘సావిత్రి’.
కథ, కథనం పక్కాగా ఉన్నప్పటికీ అసలు సమస్య హీరోయిన్‌తోనే వచ్చింది. సావిత్రి నిజ జీవిత పాత్రలో నటించే సత్తా ఉన్న హీరోయిన్‌ గురించి వెతుకులాట నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. నిత్యామీనన్‌, విద్యా బాలన్‌, సమంత.. ఇలా ఎందరి పేర్లో పరిశీలనకు వచ్చాయి. మరెందుకనో వారెవరూ సెట్‌ కాలేదు. ఇప్పుడు మరో సరికొత్త పేరు తెరమీదకు వచ్చింది. ‘నేను శైలజ’ ఫేమ్‌ కీర్తిసురేష్‌ను సావిత్రి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కీర్తి ఇప్పటికే తెలుగు టాప్‌ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని దూసుకుపోతోంది. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో ఈమె మెయిన్‌ హీరోయిన్‌. ఈ నేపథ్యంలో సావిత్రి పాత్ర కూడా కీర్తి వద్దకే వస్తే ఆమె మరింత టాప్‌కు ఎదగడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here