సవాల్‌కు సై

0
23

భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుకు సిసలైన సవాల్. ఈ ఇద్దరు మంగళవారం నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. 1980లో ప్రకాశ్ పదుకోన్, 2001లో గోపీచంద్ తర్వాత మరే భారత షట్లర్ కూడా ఈ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌ను నెగ్గలేదు. వీళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్ చేరిన భారత షట్లర్‌గా సైనా రికార్డు సృష్టించినా, టైటిల్ మాత్రం నెగ్గలేకపోయింది. ఈ వేదికపై సైనా 2015లో ఫైనలిస్టుగా నిలిచింది. టైటిల్‌పోరులో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయానికి గురైన సైనా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే జనవరిలో మలేషియా మాస్టర్స్ నెగ్గి ఈ సీజన్‌కు అద్భుత ఆరంభాన్ని అందుకున్న సైనా.. ఆల్ ఇంగ్లండ్‌లోనూ సత్తాచాటుతానన్న ధీమాతో ఉంది. మరోవైపు ఒలింపిక్ ఫైనలిస్టు అయిన సింధు కూడా సైనాకు దీటుగా టోర్నీకి సిద్ధమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here