సల్మాన్‌ చిత్రంలో షారుఖ్‌ మేజిక్‌

0
19

ల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌ కలిసి వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. తాజాగా ఈ ఇద్దరిని ఒకే చిత్రంలో చూపిస్తున్నారు కబీర్‌ఖాన్‌. సల్మాన్‌ఖాన్‌తో ‘బజరంగీ భాయ్‌జాన్‌’ రూపొందించిన కబీర్‌ ఇప్పుడు ఆయనతో ‘ట్యూబ్‌లైట్‌’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో షారుఖ్‌ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో షారుఖ్‌ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ చిత్రంలో షారుఖ్‌ ఓ మెజీషియన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. 1962ల నాటి చైనా – భారత్‌ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. గతంలో సల్మాన్‌, షారుఖ్‌ ‘కరణ్‌ అర్జున్‌’లో కలసి నటించారు. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’లో సల్మాన్‌ అతిథి పాత్రలో కనిపించాడు. ‘ఓం శాంతి ఓం’లోనూ సల్మాన్‌ ఓ పాటలో కనిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here