సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య : కడియం శ్రీహరి

0
24

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అసెంబీల్లో విద్యాశాఖ పద్దులపై చర్చ సందర్భంగా గురువారం కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి విద్యాశాఖకు రూ.12,705 కోట్లు కేటాయించామన్నారు. ప్రగతి పద్దు కింద రూ.2,682 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5,600 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఏడాది మరో 5,000 పాఠశాలల్లో ఆంగ్ల బోధన తరగతులుప్రారంభించనున్నట్టు ప్రకటించారు. బడుల్లో ప్రవేశాల పెంచేందుకు రెండువిడుతల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహిస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here