సర్కారు దవాఖానలో కలెక్టర్ కూతురు ప్రసవం

0
27

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని ములుగు ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి కూతురు ప్రగతి ప్రభుత్వ దవాఖానలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం ప్రసవాలన్నీ ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ అమ్మఒడి పథకంలో భాగంగా బాలింతకు రూ.12 వేలు ఆర్థికసాయం అందించే పథకాన్ని ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అమలుచేయనున్నది. మొదటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగేలా దృష్టిపెట్టిన కలెక్టర్ మురళి, తన కూతురిని సైతం ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ఆదర్శంగా నిలిచారు.

LEAVE A REPLY