సరిహద్దులో మరోసారి కాల్పులు

0
26

జమ్మూకశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పాక్‌ సరిహద్దు ప్రాంతంలో భారత భద్రతా బలగాలు, పాక్‌ తీవ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపారు. ఈ కాల్పుల్లో అసదుల్లా కుమార్‌ అనే సాధారణ పౌరుడు మృతిచెందాడు. కశ్మీర్‌ మత్స్య శాఖలో ఉద్యోగి అయిన ఆయన విధులు ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్త కూడా ఇలాగే కాల్పుల్లో మృతిచెందిన ఘటన అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here