సముద్రంలో కూలిన ఇండోనేషియా విమానం 12 మంది మృతి

0
21

కార్తా, డిసెంబర్ 3: ఇండోనేషియా పోలీస్ విభాగానికి చెందిన ఓ విమానం శనివారం సముద్రంలో కూలిపోయింది. 12 మందితో ప్రయాణిస్తున్న ఎం28 ఉదయం 9.24 గంటలకు ఇండోనేషియాలోని పింగ్‌కల్ పినాంగ్ ప్రాంతం నుంచి బయలుదేరిందని, 10.15 గంటలకు పశ్చిమ ఇండోనేషియా ప్రాంతంలోని బాటమ్ దీవికి సమీపానికి చేరుకోగానే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారులు తెలిపారు. విమానంలో ఐదుగురు సిబ్బంది, ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలోని రైయూ ఐలాండ్స్ ప్రావిన్స్ పరిధిలో కూలిపోయినట్లు భావిస్తున్నామన్నారు. విమానం కూలిపోయిన సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని, జాలర్లు విమాన శిథిలాలు, మృతదేహాల భాగాలు గుర్తించారని టాంజుంగ్ పినాంగ్ నావల్ బేస్ కమాండర్ ఎస్ ఐరవన్ తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, సింగపూర్ సహాయం అందిస్తున్నదని చెప్పారు. ఇండోనేషియాలో ఇటీవల పలు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. నవంబర్‌లో ఓ కార్గో విమానం కూలిపోయి నలుగురు చనిపోగా, గత వారం ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ముగ్గురు ముగ్గురు మృతిచెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here