సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణాలపై ప్రగతి

0
17

సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాలు, జిల్లా పోలీస్ కార్యాలయాలు నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించి వెంటనే డిజైన్లు ఖరారు చేసి టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
సమీక్షలో సీఎం మాట్లాడుతూ ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కార్యాలయాలుండాలన్నారు. సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టరేట్లు కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. మిగతా 28 జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాలు నిర్మించాలి. ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తం. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. పరిపాలనా సౌలభ్యం, కార్యాలయాలకు వచ్చే ప్రజలకు, పని చేసే అధికారులకు సౌకర్యంగా ఉండాలి. సమావేశాలు, స్టేట్ ఫెస్టివల్స్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు.

LEAVE A REPLY