సమావేశాలు 30 రోజులు జరగాలి

0
19

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలు సూచించేందుకు వీలుగా శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు కనీసం 30 రోజులు కొనసాగే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజుకు ఆయన బుధవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తన లేఖల్లో వారి దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర కరవు, తాగునీటి ఎద్దడి నేపథ్యంలో సత్వరమే సహాయక చర్యలనూ చేపట్టాల్సి ఉందని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ శాసనసభలో మరోసారి తీర్మానం చేయాలని కోరారు.

LEAVE A REPLY