సమాజ్‌వాదీ పార్టీలో చోటుచేసుకున్న రాజకీయ డ్రామా

0
17

సమాజ్‌వాదీ పార్టీలో చోటుచేసుకున్న రాజకీయ డ్రామాకు ఇంకా తెరపడినట్టు లేదు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బషిష్కరణకు గురైన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ఆదివారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్ రామ్‌గోపాల్ యాదవ్ తనను చంపేస్తానని బెదరించినట్టు అమర్ సింగ్ ఆరోపించారు. ‘రామ్‌గోపాల్ యాదవ్ టార్గెట్ నేనే. ఆయన బహిరంగంగానే నన్ను చంపుతానని బెదిరించారు’ అని తెలిపారు. అమర్‌సింగ్ ఉత్తరప్రదేశ్ వస్తే క్షేమంగా తిరిగి వెళ్లలేరని కూడా రామ్‌గోపాల్ తనను హెచ్చరించినట్టు చెప్పారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తనను ఓడిపోయిన పోట్లగిత్తలా రామ్‌గోపాల్ యాదవ్ చూస్తున్నారని అన్నారు.

LEAVE A REPLY