సమాజ్‌వాదీ పార్టీపై ఆధిపత్యం కోసం

0
26

ఉత్తరప్రదేశ్‌లో తొలివిడత ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీలో శాంతి ఒప్పందం కోసం కసరత్తు మరింత తీవ్రమైంది. ఇప్పటికీ మా పార్టీ ముఖచిత్రం ములాయం సింగ్ యాదవేనంటూ తండ్రిని సమర్థిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. తండ్రిని మంగళవారం మరోసారి కలుసుకుని సంధి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నేతాజీని ఆశీస్సుల కోసం కలిశాను అని అఖిలేశ్ చెప్పారు. 12 గంటల్లో తండ్రితో రెండుసార్లు ఆయన సమావేశమయ్యారు. పార్టీ గుర్తు సైకిల్ కోసం జరిగిన పోరులో కొడుకు చేతిలో ఓడిపోయిన ములాయం 38 మంది అభ్యర్థుల జాబితాను అఖిలేశ్‌కు అందజేశారు. ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ పేరు లేకపోవడం గమనార్హం. శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ పేరును మాత్రం ములాయం అందులో చేర్చారు. విస్మరించడానికి వీల్లేని తప్పనిసరి అభ్యర్థులంటూ ములాయం ఆ జాబితాను అఖిలేశ్‌కు అందజేశారు. గతనెల ములాయం తయారు చేసిన జాబితాయే తండ్రీకొడుకుల మధ్య అమీతుమీ యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను అఖిలేశ్ ఏం చేస్తారనేదానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here