సమన్వయం, సహకారమే విజయానికి బాట

0
25

రాష్ర్టాల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతో మంచి ఫలితాలు సాధించవచ్చునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. పెట్టుబడుల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డా పాలసీలు, పరిజ్ఞానం మార్పిడి ఉండాలని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ఆకర్షణ అనేది ఇపుడు రాష్ర్టాల మధ్య కాకుండా దేశాల మధ్య పోటీగా మారిందని తెలిపిన కేటీఆర్, పరస్పర సహకారం సమన్వయంతో దేశానికి మరిన్ని పెట్టుబడులు సాధించడంలో విజయం సాధించవచ్చునని చెప్పారు. రెండు రోజుల చెన్నై పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఇండియాటుడే గ్రూప్ నిర్వహించిన ది సౌత్ ఇండియా కాంక్లేవ్‌లో మంగళవారం పాల్గొన్నారు.

LEAVE A REPLY