సభకు ప్రధాని రావాల్సిందే..

0
27

పెద్దనోట్ల రద్దుపై ఓటింగ్‌కు వీలు కలిగే విధంగా 56వ నిబంధన కింద చర్చ జరుగాలి.. ప్రధానమంత్రి సభకు రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని జపాన్ నుంచి గోవా వరకు తిరుగుతూ నోట్ల రద్దు గురించి మాట్లాడుతున్నారు కానీ, పార్లమెంటుకు రావడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నిస్తున్నాయి. అధికార పక్షం మాత్రం 193 నిబంధన కింద చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ, చర్చ నుంచి పారిపోతున్నాయని ప్రతిపక్షాలనే విమర్శిస్తున్నది. నోట్ల రద్దు చర్చ విషయమై ఉభయసభల్లో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది.
పెద్దనోట్ల రద్దు కారణంగా మరో రోజు పార్లమెంటు సమావేశాలు వృథా అయ్యాయి. సోమవారం కూడా పార్లమెంటులో గందరగోళం కొనసాగింది. 56వ నిబంధన కింద చర్చ జరుగాలనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధాని జపాన్ నుంచి గోవా వరకు తిరుగుతున్నారు. కానీ పార్లమెంటుకు రావడం లేదు. నోట్ల రద్దు గురించి బయట మాట్లాడుతున్నారు కానీ చట్టసభకు రావడానికి ఎందుకు జంకుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అధికార పక్షం మాత్రం రాజ్యసభలో తమకు బలం లేనందువల్ల 56వ నిబంధన కింద చర్చ కు అంగీకరించకుండా తప్పించుకుంటున్నది. నోట్ల రద్దుపై వరుసగా నాలుగో రోజున పతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సోమవారం ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సోమవారం ప్రారంభం కాగానే మొదట ఆదివారం కాన్పూర్ రైలు ప్రమాదంలో చనిపోయిన మృతులకు శ్రద్ధాంజలి ఘటించింది. ఆ వెనువెంటనే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, ఆప్ సభ్యులు సభ మధ్యకు వెళ్లి పెద్ద నోట్ల రద్దుపై 56వ నిబంధన కింద చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here