‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వస్తోంది!

0
56

హాస్యనటుడు సప్తగిరి హీరోగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సప్తగిరి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో రోహిణి ప్రకాశ్‌ కథానాయికగా నటించారు. కె. రవికిరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌ బుల్గానిస్‌ స్వరాలు సమకూర్చారు. సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అతిథిగా హాజరై పాటలను విడుదల చేశారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాని చూడాలని ఉందని పవన్‌ తన అభిప్రాయాన్ని వేడుకలో చెప్పారు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here