సన్ ఆఫ్ లేడీస్ టైలర్

0
31

వంశీ దర్శకత్వంలో రూపొందిన లేడీస్ టైలర్ అలనాడు విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ప్రేక్షకులకు మరచిపోలేని వినోదాన్ని పంచింది. ఆ పాతమధురం లేడీస్ టైలర్‌కు సీక్వెల్‌గా నేటి ట్రెండ్‌కు అనుగుణంగా తెరకెక్కిన చిత్రం ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ నేటి ట్రెండ్‌కు తగిన విధంగా, ఆనాటి లేడీస్ టైలర్‌కు ఏమాత్రం తగ్గకుండా చక్కటి కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడనేదే చిత్ర ఇతివృత్తం. పాపికొండలు, రాజోలు పరిసర ప్రాంతాల్లో 62రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెల మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here