సదర్‌మాట్ బరాజ్‌కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన

0
38

సదర్‌మాట్ బరాజ్ 30 ఏండ్ల కల అని, దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే ప్రజలే తరిమి కొట్టాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద రూ.516.23 కోట్లతో గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ తమ్మిడిహట్టి, కాళేశ్వరం కట్టవద్దు, రైతుల పొలాలకు నీరు రావద్దని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు. మొన్న మల్లన్నసాగర్.. నిన్న కాళేశ్వరం. రేపు సదర్‌మాట్ వద్దకు వస్తారు. వారిని మీరే చూసుకోవాలి. రైతులే తరిమి తరిమి కొట్టాలి అని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే కాంగ్రెస్ వాళ్ల ఉనికి లేకుండా పోతుందని అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. అందుకే మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటున్నారు. హైకోర్టు, గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్తున్నారు. ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.

LEAVE A REPLY