సచిన్ ‘వీడెవడు’థియేట్రికల్ ట్రైలర్

0
26

తాతినేని సత్య దర్శకత్వంలోసచిన్ జోషి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వీడెవడు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీగా సాగనుంది. ఈషా గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సచిన్ ఈ చిత్రంలో కబడ్డీ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నారు. అయితే అఖిల్ కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను సస్పెన్స్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ మొత్తం కిల్లర్, లూజర్, విలన్, గ్యాంబ్లర్, హీరో, ఫైటర్ లాంటి పదాలు గజిబిజీగా రాసి ఉన్నాయి. ఆ తర్వాత విడుదలైన చిత్ర మోషన్ పోస్టర్ లో గురజాడ చెప్పిన ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు చూడచూడ రుచులు జాడ వేరు అనే పద్యం బ్యాక్ గ్రౌండ్ లో వినిపించి మూవీపై మరింత ఆసక్తిని కలిగించింది. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా స్టన్నింగ్ గా ఉంది. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here