సచిన్‌ స్టంపౌట్‌ పాపం నాదే

0
22

టెస్టు కెరీర్లో సచిన్‌ స్టంపౌట్‌ అయింది ఒకే ఒక్కసారి. 2001లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆష్లే గైల్స్‌ అదే పనిగా నెగెటివ్‌ బౌలింగ్‌ వేసి.. సచిన్‌ను అసహనానికి గురి చేసి స్టంపౌటయ్యేలా చేశాడు. ఐతే సచిన్‌ ఆ రోజు స్టంపౌట్‌ కావడంలో ప్రధాన పాత్ర తనదే అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్‌. ‘‘గైల్స్‌ లెగ్‌ సైడ్‌ వికెట్‌కు దూరంగా బంతులేస్తున్నాడు. నేను సులువుగా షాట్లు ఆడుతూ ఉంటే.. సచిన్‌ ఎక్కువ ప్యాడ్లు అడ్డం పెట్టాడు. అప్పుడు సచిన్‌ దగ్గరికెళ్లి బంతి పెద్దగా స్పిన్‌ కావడం లేదని.. ముందుకొచ్చి షాట్లు ఆడమని చెప్పాను. ఐతే గైల్స్‌ బంతి ఒక్కటి మాత్రమే స్పిన్‌ అయింది.

LEAVE A REPLY