సచిన్‌.. సెహ్వాగ్‌ సరదా సంభాషణ

0
22

2003లో వరల్డ్‌కప్‌ గెలవనప్పటికీ.. ఆనాటి మ్యాచ్‌లు అభిమానులకు గుర్తుండే ఉంటాయి. గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సెహ్వాగ్‌ల బ్యాటింగ్‌ విన్యాసాలు మరిచిపోలేం.. అయితే చాలా సంవత్సరాలపాటు క్రికెట్‌ ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఆటకు వీడ్కోలు పలికారు. వీరిని మైదానంలో చూడలేకపోయామనే బాధను తీర్చేందుకు.. సెహ్వాగ్‌, సచిన్‌లు సామాజిక మాధ్యమం ట్విటర్‌ ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో సెహ్వాగ్‌ ప్రారంభించిన క్రికెట్‌ పాఠశాలను ఇటీవల ‘క్రికెట్‌ దేవుడు’ సచిన్‌ సందర్శించాడు. వారిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని, వారి మధ్య జరిగిన సరదా సంభాషణలను ట్విటర్‌ ద్వారా సెహ్వాగ్‌ అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY