సచిన్‌కు సలహా ఇచ్చిన‌ వెయిటర్‌

0
24
చిన్‌ తెందుల్కర్‌ లాంటి ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌కు ఒక హోటల్‌ వెయిటర్‌ ఆటకు సంబంధించిన సలహా చెప్పాడంటే.. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా సచిన్‌ పాటించాడంటే నమ్మడం కష్టమే. ఐతే స్వయంగా సచినే ఈ సంగతి వెల్లడించాడు కాబట్టి నమ్మాల్సిందే. ‘‘మనం ఎవరి సలహాలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఎంతో మెరుగవుతాం. చెన్నైలో ఒకసారి హోటల్‌ వెయిటర్‌ నా దగ్గరికి వచ్చి మీరేం అనుకోనంటే ఒక విషయం చెబుతానన్నాడు. నా మోచేతి గార్డ్‌ వల్ల నా బ్యాట్‌ వూపు దెబ్బ తింటోందని చెప్పాడు. అతను చెప్పింది 100 శాతం నిజం. నాకు అంతకుముందే అది అసౌకర్యంగా అనిపించింది. అతను చెప్పిన వెంటనే నేను నా మోచేతి గార్డ్‌ను మార్చుకున్నాను. మన దేశంలో పాన్‌వాలా దగ్గర్నుంచి సీఈవో వరకు అందరూ సలహాలిస్తారు. మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని సచిన్‌ తెలిపాడు.

LEAVE A REPLY