సకాలంలో కూలీలకు అందని వేతనం

0
5

ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్రమంగా అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారన్న ఆరోపణలున్నాయి. మజ్జిగ పంపిణీ, కూలీలకు సౌకర్యాలు, బిల్లుల చెల్లింపు, పెండింగ్‌ ఖాతాల పరిష్కారాలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలు తిష్టవేసి పరిష్కారానికి నోచుకోక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

పంపిణీ కాని మజ్జిగ :జిల్లాలో రోజుకు ఉపాధి పనులకు 1.80 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వేసవిలో కూలీలకు వడదెబ్బ సోకకుండా ఒక్కొక్కరికి 250ఎం.ఎల్‌ మజ్జిగను అందించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ మేట్లకు మజ్జిగకు రూ.4లు, పంపిణీ చేసినందుకు ఒక్క రూపాయి ఇస్తారు. అయితే జిల్లాలో చాలా చోట్ల మేట్లు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయకుండానే పంపిణీ చేస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తమ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ ఈ విషయం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

LEAVE A REPLY