సంస్థాగత బలోపేతంపై భాజపా దృష్టి

0
23

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు భాజపా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది. పార్టీలో భారీగా చేరిన సభ్యులతో ఉత్సాహంగా ఉన్న భాజపా నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పోలింగ్‌ బూత్‌ల్లోనూ కమిటీలు ఏర్పాటుచేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో.. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నవారికి నాయకత్వలక్షణాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు భాజపా నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలో 350 మంది నాయకుల్ని ఎంపికచేసి.. వారికి జాతీయస్థాయి నేతలతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే 175 శాసనసభ నియోజకవర్గాల్లో మండలస్థాయిలో నేతలకు 12 అంశాలపై రెండ్రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా స్థాయిలో మూడు రోజుల శిక్షణ ఇస్తున్నారు.

LEAVE A REPLY