సంగీతం కూడా కథ చెప్పాలన్నారు!

0
35

క్రిష్‌తో ఇదివరకు చేసిన ‘కంచె’ కూడా చారిత్రక చిత్రమే. అయితే అది వేరొక దేశంలో, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కథ. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మన నేలపై జరిగిన కథ. ‘గౌతమిపుత్ర..’కి సంగీతం అందించడాన్ని ఓ సవాల్‌గా పరిగణించా. ఈ కథలో పలు పార్శా్వలుంటాయి. యుద్ధం, భావోద్వేగాలకి సంబంధించిన సన్నివేశాలు అత్యంత కీలకం. చారిత్రక కథ కాబట్టి అప్పటి కాలానికి తగ్గట్టుగా సంగీతం ఉండాలి, అదే సమయంలో ఆ సంగీతం నేటి తరాన్నీ అలరించేలా ఉండాలి. వాయిద్యాల్లో ఏది పడితే అది వాడకూడదు కానీ… శ్రోతలకు నచ్చేలా సంగీతం ఉండాలి. ఇలా చాలా పరిమితుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో సంగీతం కూడా కథ చెప్పాలని దర్శకుడు క్రిష్‌ సూచించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఆయనతో ప్రయాణం మరెన్నో కొత్త విషయాల్ని నేర్పింది. భాషపై నాకు పట్టులేదు కాబట్టి రచయిత బుర్రా సాయిమాధవ్‌ రికార్డింగ్‌ సమయంలో నాకు చక్కటి సహకారం అందించారు.

LEAVE A REPLY