సంగీతం ఓ మహాసాగరం

0
44

తొలి పాట అనుభవం…: చెన్నైలోని భరణి స్టూడియోలో 1961లో తొలి పాట పాడిన అనుభవం నా మదిలో ఇంకా తాజాగానే ఉంది. ‘కాల్‌ పాడుదల్‌’ అనే మలయాళ చిత్రం కోసం ‘కానంబు… నానో కారెరుంబు..’ పాటను పాడాలి. గాయకుడు కావాలనే తపన, తొలి పాట అనే భయం… రెండూ నాలో పోటీపడుతున్నాయి. అందులోనూ ఆరోజు నాకు జ్వరం కూడా… అయినా నా స్వరం వినిపించా. మొదట వాళ్లకు నచ్చలేదు. ఆ విషయాన్ని గ్రహించాను. ఏం చేయాలి? ఎన్నో కష్టాలు పడి చదువుకుని స్వరాలు నేర్చుకున్నవాడిని. ఫీజు కట్టడానికి సైతం డబ్బులు లేని పరిస్థితులను దాటుకుని ఎలాగో విద్వాన్‌ కోర్సు పూర్తి చేసినవాణ్ని. ఆ క్షణంలో ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో దర్శకుడికి కావల్సినట్టు పాడా. అదే నాకు తొలి విజయాన్ని అందించింది. నా తొలి పాట ప్రముఖ పాటల రచయిత నారాయణ గురుస్వామి రాసిన తత్వం. జాతి, మత భేదం, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు… ఇలాంటివి ఉండకూడదని చాటే పాట అది. భిన్నత్వంలో ఏకత్వానికి దర్పణం పట్టే ఆ పాటను పాడడం నా అదృష్టం అనుకుంటా. సాధించింది కొంతే…: ఇన్నేళ్ల నా స్వర ప్రయాణంలో ఏదో సాధించానని అంటున్నారు. కానీ సంగీతం ఓ మహా సాగరం. అందులో కొంత దూరమే ప్రయాణం చేశా. ఈ గుర్తింపు దేవుని అనుగ్రహం. ఆ అదృష్టం నాకు దక్కడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నా గురువులు, దేవుళ్లు, అవకాశాలు ఇచ్చిన సంగీత దర్శకులే ఈ ఘనతకు కారకులు. వారందరికీ ధన్యవాదాలు.

అనుభవాలే పాఠాలు…: కష్టసుఖాలను జీర్ణించుకోవడం దేవుడు నాకిచ్చిన వరం. కష్టాలు ప్రతి ఒక్కరికీ తప్పవు. వాటన్నింటినీ సమానంగా చూసేవాడిని. అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయి.

శైలి ముఖ్యం…: ప్రతి గాయకుడికీ ఒక్కో శైలి తప్పకుండా ఉండాలి. శీర్గాలి గోవిందరాజన్‌, టీఎం సౌందరరాజన్‌, ఘంటసాల… ఇలా ఎవరిని తల్చుకున్నా వారి పాటలు కూడా గుర్తుకు వస్తాయి. నేను మహ్మద్‌ రఫీ శిష్యుడిని. ఆయన నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నా. కానీ అనుకరించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here