సంగారెడ్డిలో కాటమరాయుడు సందడి

0
28

స్టార్ పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లాలో సందడి చేసాడు. తన తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ లో భాగంగా అక్కడికి వెళ్ళిన పవన్ తనని చూడడానికి వచ్చిన వారందరిని ఆప్యాయంగా పలకరించాడు. ఇస్మాయిల్ ఖాన్ పేటలోని దుర్గా భవాని ఆలయంలో పవన్ ,శృతి హాసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించిన టీం కమెడీయన్స్ ఆలీ, పృధ్వీలపై కూడా కొన్ని సీన్స్ షూట్ చేశారు. దాదాపు ఈ చిత్రం క్లైమాక్స్ దశకు చేరుకోగా ఫిబ్రవరి వరకు షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేసి మార్చిలో సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. తమిళ సూపర్ హిట్ చిత్రం వీరమ్ కి రీమేక్ గా కాటమరాయుడు తెరకెక్కుతోండగా ఈ చిత్రాన్ని డాలీ తెరకెక్కిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY