సంక్రాంతి పండుగ వేళ విషాదం

0
45

దుస్తులు కొనుక్కోవడానికి బైక్‌పై నాన్నతో ఇంటి నుంచి సంబరంగా వెళ్లిన ఆ చిన్నారి కొద్ది గంటలకే అమ్మానాన్నను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. లారీ రూపాన వచ్చిన మృత్యువు ఆ ఇంటి దీపాన్ని, పండుగ ఆనందాన్ని తన్నుకుపోయింది. జగ్గంపేటలో బుధవారం ఈ విషాదం జరిగింది. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పక్కన బుక్‌స్టాల్‌ నిర్వహిస్తున్న ప్రగడ వీర్రాజు కుమార్తె భావిక(8) బుధవారం లారీ కింద పడి చనిపోయింది. ఈ సంఘటనతో ఆ కుటుంబం కన్నీటి సాగరంలో మునిగి పోయింది. సంక్రాంతి కావడంతో దుస్తులు కొనడానికి వీర్రాజు తన ఇద్దరు కుమార్తెలను బైక్‌పై కాకినాడ తీసుకెళ్లాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here