సంక్రాంతికి షారుఖ్‌ ప్రత్యేక గీతం

0
21

బాలీవుడ్‌ కథానాయకుడు షారుఖ్‌ఖాన్‌ సంక్రాంతికి తన అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు. సంక్రాంతి సందర్భంగా ‘రాయీస్‌’ చిత్రంలోని ‘ఉడి ఉడి..’ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ పాటలో షారుఖ్‌ఖాన్‌, మహీరాఖాన్‌ నటించారు. ఇందులో షారుఖ్‌ తొలిసారి గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గార్బాతో వెండితెరపై సందడి చేయనున్నారు. చిత్ర దర్శకుడు రాహుల్‌ ధొలాకియా గుజరాతీయే. ‘ఉడి..’ పాట గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఉత్తరాయణం (సంక్రాంతి) అనేది గుజరాతీయులు జరుపుకునే పెద్ద పండుగ. గార్భా అక్కడ రాష్ట్ర నృత్యం. ఈ రెండూ లేకుండా గుజరాత్‌లో సినిమాలు ఉండవు. అందుకే కథలో భాగంగా ‘రాయీస్‌’లో ఓ పాట పెట్టాం’’అని చెప్పారు. ఈ చిత్రం కోసం సూరత్‌ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన మాంజా (దారం)ను ఉపయోగించారు. ‘‘రాయీస్‌లో షారుఖ్‌కు పాత్రకు గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. తన గాలిపటంతో ఇతరుల గాలిపటాలను తెంపడంలో చేయితిరిగినవాడు. అందుకే బ్లేడంత పదునుగా ఉండే మాంజాను ఉపయోగించాం. కొన్నిసార్లు షారుఖ్‌ చేతి వేళ్లకు గాయాలు అయ్యాయి’’అని చెప్పారు దర్శకుడు ధొలాకియా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here