షో టైమ్ గీతాలు

0
22

రణధీర్, రుక్సార్ జంటగా నటిస్తున్న చిత్రం షోటైమ్. ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వం వహిస్తున్నారు. రామరీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను కథానాయిక అనుష్క ఆవిష్కరించారు. తొలి ప్రతిని శివశక్తిదత్తా స్వీకరించారు. ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదలచేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమా థియేటర్‌లో జరిగే కథ ఇది. పాటలు, ప్రచార చిత్రం బాగున్నాయి. మా అబ్బాయి కార్తికేయ ఇందులో ఓ పాట పాడాడు. కాంచీ మాట్లాడే ప్రతి మాటలో వెటకారం ఎక్కువగా ఉంటుంది. దర్శకుడిగా అతడికి ఈ సినిమాతో పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

మంచి సినిమాను తెరకెక్కించగలననే నమ్మకంతో చేసిన ప్రయత్నమిది. నేను వెటకారంగా మాట్లాడుతుంటానని, అందరిని విమర్శిస్తుంటానని రాజమౌళి అంటుంటారు. నన్ను కూడా వాళ్లు విమర్శిస్తే ఆనందంగా ఉంటుంది. అప్పుడే నేను చేసిన తప్పులు ఏమిటో తెలుసుకోగలను. వాటిని సరిదిద్దుకోగలను అని కాంచీ తెలిపారు. ఐటెమ్‌సాంగ్స్, ఫైట్స్ లేకుండా వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని సంగీత దర్శకుడు కీరవాణి పేర్కొన్నారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయేంద్రప్రసాద్,కె.రాఘవేంద్రరావు, ప్రసాద్.వి.పొట్లూరి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here