షూట‌ర్‌పై కోచ్ అత్యాచారం

0
20

న్యూఢిల్లీ: ఓ అంత‌ర్జాతీయ‌ స్థాయి షూట‌ర్‌పై కోచ్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో న‌వంబ‌ర్ 12న జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. చాణ‌క్య‌పురి పోలీస్ స్టేష‌న్‌లో గురువారమే షూట‌ర్ కోచ్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆ కోచ్ మాజీ ఒలింపియ‌న్‌, అర్జున అవార్డీ కావడం గ‌మ‌నార్హం. గ‌త నెల 12న ఆ మ‌హిళా షూట‌ర్ బ‌ర్త్ డే పార్టీ సంద‌ర్భంగా ఆమె తాగే డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి ఆ కోచ్ అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ షూట‌ర్ ఉండే ప్ర‌భుత్వ క్వార్ట‌ర్స్‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆ కోచ్ భార‌త్ త‌ర‌ఫున ఎన్నో షూటింగ్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌, కామ‌న్వెల్త్ గేమ్స్‌, ఏషియ‌న్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ కేసు న‌మోదైన‌ప్ప‌టి నుంచి అత‌డు ప‌రారీలో ఉన్నాడు. 376, 328 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసుల అధికార ప్ర‌తినిధి దీపేంద్ర పాఠ‌క్ వెల్ల‌డించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here