షాట్‌గన్ ప్రపంచకప్‌లో అంకుర్‌కు స్వర్ణం

0
10

ఇటీవల అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత షూటర్ అంకుర్ మిట్టల్ మరోసారి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో అంకుర్ పురుషుల వ్యక్తిగత డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచి అదరగొట్టాడు. ఆరుగురు షూటర్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో అంకుర్ 80పాయింట్లకుగాను 75 స్కోరు నమోదుచేశాడు. హోరాహోరీగా జరిగిన ఈ ఫైట్‌లో ఆస్ట్రేలియా స్టార్ షూటర్ జేమ్స్ విల్లెట్‌ను వెనక్కినెట్టి అంకుర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జేమ్స్ 73 పాయింట్లు స్కోరు చేసి రెండోస్థానంతో రజత పతకం అందుకున్నాడు. చైనా షూటర్ యింగ్ కీకి కాంస్య పతకం దక్కింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్‌లో జేమ్స్ స్వర్ణం గెలువగా, అంకుర్ రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక మెక్సికో వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున మహిళల స్కీట్ ఈవెంట్‌లో రష్మీ రాథోర్, పురుషుల స్కీట్ ఈవెంట్‌లో అంగద్‌వీర్ సింగ్, మన్ సింగ్, అమరీందర్ చీమా పోటీలు శుక్రవారం జరుగనున్నాయి.

LEAVE A REPLY