షాకింగ్: యూట్యూబ్‌లో ధృవ సినిమా!

0
24
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ధృవ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల షేర్ సాధించింది. విడుదలయిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22.5 కోట్ల రూపాయలు సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అయితే వారి ఆనందాన్ని పైరసీ భూతం ఆవిరి చేసింది. గత రాత్రి యూట్యూబ్‌లో గుర్తుతెలియని పైరసీ నేరగాళ్లు ధృవ సినిమాను పోస్ట్ చేశారు. ఈ పరిణామంతో మెగా ఫ్యాన్స్ కంగుతిన్నారు. వెంటనే యాంటీ పైరసీ టీంతో మాట్లాడి ధృవ పైరసీని తొలగించారు.

LEAVE A REPLY