శ‌ర్వాతో శ్రీకాంత్ అడ్డాల‌?

0
17

`సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` వంటి ఘ‌న‌విజ‌యాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల జోరుకు `బ్ర‌హ్మోత్స‌వం` బ్రేకులు వేసింది.మ‌హేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆ సినిమా ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప‌రాజ‌యం త‌ర్వాత శ్రీకాంత్ కామ్ అయిపోయాడు.

చాలా రోజులుగా అత‌నికి సంబంధించిన వార్త‌లు రాలేదు. తాజాగా శ్రీకాంత్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో శ్రీకాంత్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో హీరోగా శ‌ర్వానంద్ ఫిక్స‌యిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే శ‌ర్వాకు శ్రీకాంత్ లైన్ వినిపించిన‌ట్టు తెలుస్తోంది. పూర్తిగా క‌థ సిద్ధం చేసుకుని, బౌండెడ్ స్క్రిప్టుతో వ‌స్తే సినిమా చేస్తాన‌ని శ‌ర్వా మాటిచిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతున్న‌ట్టు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here