శ్రీశాంత్ కేసులో సీవోఏకు కోర్టు నోటీసులు

0
20

కొచ్చి: శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం కేసులో బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్‌రాయ్ ప్యానెల్‌కు కేరళ హైకోర్టు సోమవారం నోటీసు జారీచేసింది. ఐపీఎల్-201 3 స్పాట్‌ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించడంపై బీసీసీఐ వైఖరి ఏంటో తెలుపాలని జస్టిస్ పీబీ సురేశ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ కోరింది. తదుపరి విచారణను వచ్చే జూన్ 19కి వాయిదా వేసింది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని శ్రీశాంత్ సవాలు చేయడంతో బీసీసీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై జరిగిన విచారణలో శ్రీశాంత్ దోషిగా తేలడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY