శ్రీలంకదే సిరీస్‌

0
39

గాయంతో ఆరు నెలలు క్రికెట్‌కు దూరమైన డివిలియర్స్‌ పునరాగమనం చేశాడు.. బాగానే పరుగులు చేశాడు కానీ దక్షిణాఫ్రికాకు సిరీస్‌ విజయం మాత్రం అందించలేకపోయాడు. మూడు టీ20ల సిరీస్‌ను లంక 2-1తో గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డిక్‌వెలా (68; 51 బంతుల్లో 10×4, 1×6) దూకుడుకు సీకుగె ప్రసన్న (37; 16 బంతుల్లో 3×4, 3×6) మెరుపులు తోడవడంతో 170 పరుగుల లక్ష్యాన్ని లంక 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇమ్రాన్‌ తాహిర్‌ (3/18) విజృంభించి.. లంకను కట్టడి చేశాడు. ఐతే ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేసి దక్షిణాఫ్రికా ఓటమికి కారణమయ్యారు. మొదట డివిలియర్స్‌ (63; 44 బంతుల్లో 2×4, 3×6), హెండ్రిక్స్‌ (41), మొసెలె (32 నాటౌట్‌; 15 బంతుల్లో 1×4, 3×6) చెలరేగి ఆడటంతో దక్షిణాఫ్రికా 169 (5 వికెట్లకు) పరుగులు చేసింది. మూడు టెస్టుల సిరీస్‌ను సఫారీ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here