శ్రీమంతుడు కలెక్షన్స్ క్రాస్ చేసిన ఖైదీ నంబర్ 150

0
17

గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ సినిమాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది. బిగ్ స్టార్స్ పిక్చర్స్ ఇప్పుడు మినిమం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి. కిందటేడాది నుంచి ఈ పోటీ మరీ పెరిగింది. కొన్ని నెలల కిందట ఉన్న కలెక్షన్స్ రికార్డును ఓవర్ కమ్ చేసి కొత్త సినిమాలు దూసుకెడుతున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజైన ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్ లో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్.

తెలుగు సినిమా మార్కెట్ ను బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని డివైడ్ చేసి కలెక్షన్స్ లెక్కలు చెప్పారు. నిజానికి ఆ సినిమాకు ముందు తెలుగు సినిమాల కలెక్షన్స్ గురించి ఎవరూ అంతగా చెప్పుకునేవారు కాదు. ఆ సినిమా కలెక్షన్స్ ను ఇంతవరకూ మరే తెలుగు పిక్చర్ కూడా క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాల మధ్య పోటీ ఇంతా అంతా కాదు. కలెక్షన్స్ లో ఒక హీరో సినిమాను మరో హీరో మూవీ బీట్ అవుట్ చేస్తోంది.

2015లో వచ్చిన మహేష్ బాబు మూవీ శ్రీమంతుడు – కలెక్షన్స్ లో బాహుబలి తర్వాత ప్లేస్ సాధించింది. అయితే .. లేటెస్ట్ టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 – మహేష్ బాబు శ్రీమంతుడు ను క్రాస్ చేసిందట. ఈ నెల 11న రిలీజైన చిరంజీవి సినిమా కేవలం 12 రోజుల్లోనే 92 కోట్ల రూపాయల షేర్ ను రీచ్ అయి శ్రీమంతుడు రికార్డును బీట్ చేసిందట.

నిన్నటివరకు బాహుబలి తర్వాత సెకండ్ ప్లేస్ లో శ్రీమంతుడు ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఖైదీ నంబర్ 150 కొట్టేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత మెగాస్టార్ మూవీ రాజమౌళి బాహుబలిని కూడా ఓవర్ టేక్ చేసి నంబర్ వన్ కావచ్చని అంటున్నారు. చిరంజీవి –ఖైదీ నంబర్ 150 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు గ్రాస్ ను, 85 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిందట. త్వరలోనే 200 కోట్లు రీచ్ కావచ్చని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here