శ్రీనివాస్‌ది జాత్యహంకార హత్యే

0
16

అమెరికాలో దారుణ హత్య కు గురైన భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్లపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ తొలిసారిగా స్పందించారు. శ్రీనివాస్‌ది జాత్యాహంకార హత్యేన న్నారు. అమెరికాలో రాక్షసత్వం, విద్వేషానికి చోటులేదని స్పష్టం చేశారు. అ మెరికన్ చట్టసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం రాత్రి ట్రంప్ తొలిసారిగా ప్రసంగించారు. కాన్సస్‌లో నౌకాదళ మాజీ అధికారి ఒకరు భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిపై కాల్పులు జరుపగా శ్రీనివాస్ చనిపోయిన సంగతి తెలిసిందే. విద్వేషానికి అమెరికాలో చోటులేదన్నారు. చరిత్రాత్మక నల్లజాతీయుల మాసం ముగింపు కార్యక్రమాన్ని అమెరికా వేడుకగా నిర్వహించుకుంటున్నది. సత్యం, స్వేచ్ఛ, న్యాయం అనే కాగడాను వారసత్వం గా అమెరికన్లు పుణికిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ జ్యోతి మన చేతుల్లో ఉన్నది. ప్రపంచానికి వెలుగునిచ్చేలా ఆ జ్యోతిని ప్రజ్వరిల్లేలా చేయాలి. ఐక్యత గు రించి చెప్పడానికే ఈ వేదికపైకి వచ్చాను. నేను చెప్పిన ప్రతి అక్షరం నా గుండె లోతుల్లోంచి వచ్చింది అని అన్నారు. వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మీడియా తో మాట్లాడుతూ కాన్సస్ ఘటనకు జాతివిద్వేషమే కారణమని తెలుస్తున్నది. ఈ తరహా చర్యలను అధ్యక్షుడు నిర్దంద్వంగా తోసిపుచ్చారు అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అమెరికాలోని ది రిపబ్లికన్ హిందూ సమ్మేళనం వ్య వస్థాపకుడు శలభ్‌కుమార్ స్వాగతించారు. కూచిభొట్ల మృతిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here