శ్రీకాంత్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘రా..రా’.

0
14
శ్రీకాంత్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘రా..రా’. శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  నజియా కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో  ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల గురించి, తన పిల్లల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
‘ ‘రా..రా’ సినిమాలో నాది దర్శకుడి పాత్ర. ఇదో హారర్‌ కామెడీ చిత్రం. నా కెరీర్‌లో నేను చేసిన మొదటి హారర్ ‌సినిమా ఇది. ఇప్పటివరకు చాలా దెయ్యాల సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా దెయ్యలను చూసి మనుషులు భయపడతారు. కానీ ఇందులో దెయ్యాలే మనుషుల్ని చూసి భయపడతాయి. ఇందులో ఓ దెయ్యం నన్ను ప్రేమిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది.’
‘ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ర్యాప్‌రాక్‌ షకీల్‌ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. విలన్‌ పాత్రల్లో నటిస్తారా? అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటివరకు కథానాయకుడి పాత్రలే చేశాను. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేశాను. మున్మందు అవకాశాలు వస్తే విలన్‌ పాత్రల్లో నటించడానికి అభ్యంతరం లేదు. కాలం ఎటు నడిపిస్తే అటు నడుస్తాను. ప్రస్తుతం ‘ఆపరేషన్‌ దుర్యోదన-2’తో పాటు మరో సినిమాలో కథానాయకుడిగా చేస్తున్నాను. సమకాలీన సమాజంలో రాజకీయ నాయకులు, ప్రజలు ఎలా ఉంటున్నారు? నాయకులు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు? వంటి విషయాలతో ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన సన్నివేశాలు ఏమీ ఉండవు.’
‘ఇకపోతే నా పెద్ద కుమారుడు  రోషన్‌ ‘నిర్మల కాన్వెంట్‌’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. దాంతో వాడికి సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది. చదువు కొనసాగిస్తూనే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక నా కూతురు మేధా బాగా చదువుతుంది. చదువు తప్ప తనకు ఇంకే ఆసక్తిలేదు. బాస్కెట్‌ బాల్‌ బాగా ఆడుతుంది. నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ టీంకి కూడా ఎంపికైంది. ఇక నా రెండో కుమారుడు రోహన్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రభుదేవా నటిస్తున్న సినిమాలో కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళం చిత్రాల్లో ఈ సినిమా రాబోతోంది. సినిమాలో మంచి పాత్ర అని రోహన్‌ను నటించమని చెప్పాం.’ అంటూ ముగించారు శ్రీకాంత్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here