శేషాచలంలో టాస్క్ పోర్స్ పోలీసులు- ఎర్రదొంగల మధ్య ఫైట్.!

0
23

ఏపీ సర్కార్ ‘ఎర్ర దుంగల దొంగల’పై ఎంత నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రతి రోజూ శేషాచలం అడవుల్లో దొంగలు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా..శేషాచలంలో తమిళ స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న టాస్క్ పోర్సు పోలీసులపై రాళ్లదాడి చేశారు. గురువారం సాయంత్రం ఆర్ఎస్ఐ భాస్కర్ బృందం మొదట శ్రీవారి మెట్టు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రాత్రి 10 గంటలు ప్రాంతంలో పార్వేట మండపం వద్ద.. దుంగలు మోసుకుంటూ ఇరవై మంది అడవి నుంచి వస్తూ ఎదురుపడ్డారు. లోంగిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో వారిపై రాళ్ళదాడి చేస్తూ పరుగులు తీశారు. పారిపోతున్న వారిలో జవాదిమలైకు చెందిన పెరుమాళ్ దొరికాడు. సంఘటన స్థలంలోచెల్లాచెదరుగా పడిన 16 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY