శీతాకాలంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గుల వల్ల ఢిల్లీలో వాయు నాణ్యత

0
25

శీతాకాలంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గుల వల్ల ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తున్నదని, దాంతో భూ ఉపరితలానికి తక్కువ ఎత్తులో పెద్ద మొత్తంలో కాలుష్య పొరలు పేరుకుపోతున్నాయని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వెల్లడించింది. ఢిల్లీలో భారీగా కాలుష్యం పేరుకుపోవడం వెనుక పలు పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే పొగ కారణమని నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో భూమి తక్కువ ఎత్తులో పేరుకుపోతున్న కాలుష్య పొరలను తొలగించడానికి జెట్ ఇంజిన్లను ఉపయోగించాలని ఎంఐటీ శాస్త్రవేత్తలు ప్రణాళికను సిద్ధం చేశారు. పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని అరికట్టడానికి ఎంఐటీ శాస్త్రవేత్త అయ్యంకి వీ మురళీకృష్ణ నేతృత్వంలో ఓ బృందం ఓ పైలెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నది. 45ఏండ్ల క్రితం బాల్టిక్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ను దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టర్బోజెట్స్, టర్బోప్రాంప్‌లాంటి జెట్ ఇంజిన్లను ఉపయోగించి భూమికి దగ్గరలో ఉన్న కాలుష్య పొరలను వాతావారణంలోని ఎగువ ప్రాంతానికి పంపిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భూఉపరితలంపై వాయు నాణ్యతను మెరుగుపరుచవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

LEAVE A REPLY