శివ్‌పాల్ యాదవ్ వేరు కుంపటి

0
22

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ రెండు ముక్కలైంది. సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పేరిట కొత్త పార్టీని పెడుతున్నట్లు ములాయం సింగ్ సోదరుడు, పార్టీ సీనియర్ నేత శివ్‌పాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. దీనికి ములాయంసింగ్ యాదవ్ అధ్యక్షుడుగా ఉంటారని వెల్లడించారు.
శివ్‌పాల్ స్వస్థలం ఎటావాలో, తన బావ అజంత్ సింగ్ యాదవ్‌తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. నేతాజీ(మూలాయం)కి పూర్వ గౌరవాన్ని తేవడానికి, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి త్వరలోనే పార్టీని అధికారికంగా ప్రకటిస్తాం.. అని వెల్లడించారు. కాగా, తమ్ముడి ప్రకటనపై ఇప్పటివరకు ములాయం స్పందించలేదు.
ములాయం 1992లో సమాజ్‌వాద్ పార్టీని స్థాపించారు. కానీ గతేడాది పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. ములాయం కొడుకు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఒకవర్గం, ములాయం, అతడి సోదరుడు శివ్‌పాల్ మరో వర్గంగా చీలిపోయారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ, బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో మూడు నెలల్లోగా సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలను ములాయంకు అప్పగించకపోతే కొత్త పార్టీని ప్రకటిస్తానని శివ్‌పాల్ కొంతకాలం క్రితం హెచ్చరించినా అఖిలేశ్ లెక్కచేయలేదు

LEAVE A REPLY