శాతకర్ణి సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం

0
24

బసవతారకరామ పుత్ర బాలయ్య అంటూ దర్శక ధీరుడు రాజమౌళి బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ రోజు ఉదయం కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్ లో వేసిన బెనిఫిట్ షోకి హాజరైన రాజమౌళి.. బాలయ్య ,క్రిష్ లతో కలిసి ఈ చిత్రాన్ని చూశాడు. చిత్రం పూర్తైన వెంటనే ట్విట్టర్ వేదికగా ఈ సినిమాను ఓ రేంజ్ లో ఎత్తేశాడు. మీకు సెల్యూట్ చేస్తున్నాను..శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రంతో నందమూరి తారకరామారావు గారిని గుర్తు చేసారు. ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. ఇక అంజనాపుత్ర క్రిష్ నీకు 12 కోట్ల మంది తెలుగు ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయని అన్నాడు. నీ నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అన్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి ఓ మహాకావ్యాన్ని 79 రోజులలో పూర్తి చేయడం నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. సాయి మాధవ్ గారు మీ పెన్ను శాతకర్ణి కత్తిలా ఉంది. ఇక కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం తెలుగు చిత్రాలలో ఎప్పటికి గుర్తుండి పోయే చిత్రం అవుతుందని రాజమౌళి తెలిపాడు. ఇక బాలయ్య వందో చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్స్ దగ్గర బారులు తీరారు. కటౌట్స్ ,పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. బాలయ్య అభిమాని గోపిచంద్ అనే వ్యక్తి బసవతారకం ఆస్పత్రికి విరాళంగా 100100 రూపాయలతో టికెట్ కోనుగోలు చేసి బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here