శశికళ పేరుతో ఓ సినిమా

0
24

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఎడిఎంకె అధినేత జయలలిత జీవిత కథను వెండితెరకెక్కించాలని కొంత మంది దర్శకులు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ జయలలిత నెచ్చెలి శశికళ పేరుతో ఓ సినిమా చేయబోతున్నానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
తాజాగా తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కూడా జయలలిత జీవిత కథపై సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడని, జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని రమ్యకృష్ణ ఓ వార్తా సంస్థకు వెల్లడించినట్లు తెలిసింది. కెరీర్ తొలినాళ్లలో మీ డ్రీమ్ రోల్ ఏంటని పాత్రికేయులు ప్రశ్నిస్తుండేవారు. ఇప్పుడు చెబుతున్నా నాకు జయలలిత పాత్రలో నటించాలని వుంది. నా కెరీర్‌లో అదే నా డ్రీమ్ రోల్‌గా భావిస్తున్నాను. ఆమె జీవిత కథతో ఎవరైనా పేరున్న ఫిల్మ్‌మేకర్ సినిమా చేయాలని నన్ను సంప్రదిస్తే నటించడానికి నేను సిద్ధమే అని రమ్యకృష్ణ తెలిపినట్లు సమాచారం.

LEAVE A REPLY