శశికళకే పార్టీ పగ్గాలు?

0
26

అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతలు ప్రస్తుతం కోరస్‌గా వినిపిస్తున్న డిమాండ్ ఇదే. సీఎంతో సహా పార్టీనేతలు ఆమెను కలుసుకోవడంలో తప్పులేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఇక ప్రధాన కార్యదర్శి పీఠం మీద అమ్మ ఒకప్పటి సహాయకురాలు అధిష్ఠించడం కేవలం లాంఛనమే అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ అధినేతగా శశికళ ఎన్నికయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది. నాయకత్వం కోసం కుమ్ములాట ఏదీ జరుగడం లేదని, సీఎంతో సహా పార్టీ నేతలు శశికళను కలుసుకోవడంలో ఎలాంటి తప్పులేదని సంస్థాగత కార్యదర్శి సీ పొన్నయ్యన్ చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆమెకు మాత్రమే పార్టీని నడిపించే సత్తా ఉందని సెంగోటయ్యన్ వంటి సీనియర్ నేతలు బాహాటంగానే శశకళకు మద్దతు తెలుపుతున్నారు. 30 ఏండ్లుగా అమ్మను కనిపెట్టకుని ఉన్న చిన్నమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టాలని వలర్మతి అనే సీనియర్ మహిళా నేత ప్రకటించారు.

LEAVE A REPLY