శర్వానంద్ ‘మహానుభావుడు’?

0
31

వెంకటేష్‌తో బాబు బంగారం చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు మారుతి తాజాగా మరో సినిమాకు రెడీ అయిపోతున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే…బాబు బంగారం తరువాత ఓ యువ హీరోతో సినిమా చేయాలనుకున్న మారుతి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తాజాగా హీరో శర్వానంద్‌తో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. బ్రాండెడ్ వస్తువుల్ని మాత్రమే ఇష్టపడుతూ వాటి చుట్టూ తిరిగే ఓ యువకుడి నేపథ్యంలో సాగే వినూత్నమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, ఈ సినిమాకు మహానుభావుడు అనే టైటిల్ పరిశీలనలో వుందని తెలిసింది. ైస్టెలిష్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణారెడ్డి నిర్మించనున్నారు. శర్వానంద్ ప్రస్తుతం శతమానంభవతి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here